హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎమ్మెల్యే

NTR: పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి ఎన్నికల బరిలో నిలబడిన వారిపై నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సీరియస్ అయ్యారు. పెద్దాపురానికి చెందిన మధుసూదనరావు, తుర్లపాడుకు చెందిన ఆదిమూలం నరేంద్రకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఏమాత్రం లేదని ఆమె స్పష్టం చేశారు. పార్టీ నియమావళిని ఉల్లంఘించే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.