IPL-2027 మినీ వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్ గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఈ నేపథ్యంలో జట్టులో మార్పులకు CSK సిద్ధమవుతోంది. ట్రేడింగ్ ద్వారా లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్ జట్టులో చేరడంతో కొందరు విదేశీ ప్లేయర్లను విడుదల చేసే అవకాశముంది. రూ.14.20 కోట్ల చొప్పున కొనుగోలు చేసిన ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మలను కొనసాగించడంపైనా దృష్టి పెట్టింది. మరోవైపు ధోనీ భవితవ్యంపై కూడా ఉత్కంఠ నెలకొంది.
క్రీడలు
IPL-2027: ధోనీ భవితవ్యంపై ఉత్కంఠ!


