హైదరాబాద్: 28°C
వార్తలు

తండ్రిపై దాడి.. హోటల్‌లో యువతుల వీరంగం!

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఇద్దరు యువతులు ఓ హోటల్‌లో నానా హంగామా సృష్టించారు. కొన్ని రోజుల క్రితం తమ తండ్రిపై దాడి చేశారనే ఆరోపణలతో వారు ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో హోటల్‌లోని వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు.. అక్కడి టేబుళ్లను విసిరేశారు. వారిని అడ్డుకునేందుకు స్థానికులు, హోటల్ కస్టమర్లు ప్రయత్నించిన వీడియో వైరల్‌గా మారింది.