హైదరాబాద్: 28°C
వార్తలు

బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ 

TG: ఆదిలాబాద్ జిల్లా బేలలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. పింఛన్ల ప్రొసిడింగ్ కాపీల పంపిణీలో ఫోటో దిగే విషయంలో వివాదం రాజుకుంది. పరస్పరం పిడిగుద్దులతో ఇరుపార్టీ కార్యకర్తలు దాడి చేసుకున్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉండగానే కార్యకర్తలు దాడికి దిగారు. బేల మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ గార్డెన్‌లో ఘటన చోటుచేసుకుంది.