హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌తో టెస్టు సిరీస్‌.. న్యూజిలాండ్‌కు షాక్

టీమిండియాతో రెండు టెస్టుల సిరీస్ ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్‌కు కుడి చేతికి గాయం కావడంతో టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతడు కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందనే దానిపై స్పష్టత లేదని కివీస్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. శాంట్నర్ స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్‌కు చోటు దక్కింది.