బెల్జియం తరఫున 16 ఏళ్ల పాటు ఆడిన రొమేలు లుకాకు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పాడు. లుకాకు 135 మ్యాచ్‌ల్లో 94 గోల్స్ సాధించాడు. 4 ఫిఫా WCలు, 3 యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లలో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు. దేశం తరఫున ఆడటం గర్వకారణమని, 16 ఏళ్ల ప్రయాణానికి బెల్జియంకు కృతజ్ఞతలు తెలిపాడు.
క్రీడలు
అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లుకాకు గుడ్‌బై


