టీమిండియాతో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ గాయం కారణంగా ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఐదో వన్డే సందర్భంగా అతడు గాయపడ్డాడు. తాజాగా ఆ గాయం ఫ్రాక్చర్ అని తేలడంతో సిరీస్ నుంచి తప్పించారు. శాంట్నర్ స్థానంలో మరో ఆల్‌రౌండర్ డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్‌ను కివీస్ జట్టులోకి తీసుకున్నారు.
క్రీడలు
బిగ్ షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ దూరం


