హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీ పర్యటనకు బయలుదేరనున్నారు. ఉదయం ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హస్తినకు పయనమవుతారు. ఈ టూర్‌లో పలు కీలక ప్రాజెక్టులపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. పర్యటన ముగించుకుని రాత్రికి తిరిగి రానున్నారు.