హైదరాబాద్: 28°C
క్రీడలు

'పాలలో ఈగను తీసేసినట్లు కుల్దీప్‌ను తప్పించారు'

న్యూజిలాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు కుల్దీప్‌ యాదవ్‌ను ఎంపిక చేయకపోవడంపై మాజీ క్రికెటర్‌ ఆకాష్‌ చోప్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు. సరైన అవకాశాలు ఇవ్వకుండానే జట్టు నుంచి తప్పించడం అన్యాయమని పేర్కొన్నాడు. పాలలో ఈగను తీసేసినట్లు కుల్దీప్‌ను జట్టు నుంచి తొలగించారన్నాడు. గత ఎనిమిదేళ్లుగా అతనికి తగిన గుర్తింపు, అవకాశాలు లభించడం లేదని అభిప్రాయపడ్డాడు.