PLD: ముప్పాళ మండల పరిధిలోని నార్నేపాడు, మాదల గ్రామాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) శివప్రసాద్ సందర్శించారు. ఆయా కేంద్రాల్లో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను, అక్కడి ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని కేంద్రంలోని సిబ్బందికి సూచించారు.
వార్తలు
నామినేషన్ కేంద్రాలను సందర్శించిన ఎంపీడీవో


