హైదరాబాద్: 28°C
వార్తలు

'ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి'

KRNL: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.6,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జిల్లా డీఆర్వో వెంకటనారాయణమ్మకు వినతిపత్రం అందజేశారు. బకాయిల విడుదలలో జాప్యం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్. ఈరేష్ ఆవేదన వ్యక్తం చేశారు.