హైదరాబాద్: 28°C
క్రీడలు

నేడు భారత్-పాక్ ఫైనల్ ఫైట్

సౌత్ ఏషియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో నేడు భారత్, పాక్ తలపడనున్నాయి. ఢాకా వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ హై వోల్టేజ్ పోరు ప్రారంభమవుతుంది. ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా.. పదో టైటిల్ గెలవాలని చూస్తోంది. పాక్ ఫైనల్ చేరడం ఇదే మొదటిసారి. కాగా, గ్రూప్ దశలో పాక్‌పై 3-2 తేడాతో భారత్ గెలవడంతో నేటి తుది పోరుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.