BHNG: రాజాపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి మఠం ఆలయంలో డిసెంబర్ ఆరవ తేదీన నిర్వహించనున్న స్వామివారి కల్యాణ మహోత్సవ ఆహ్వాన కరపత్రాన్ని సోమవారం ఆవిష్కరించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు ఈ కరపత్రాన్ని విడుదల చేశారు. మహంత్ సత్యనారాయణ దాస్, రామేశ్వర్ దాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
వెంకన్న కల్యాణ మహోత్సవ కరపత్రం ఆవిష్కరణ


