హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్త పెన్షన్ల కోసం వృద్ధుల ఎదురుచూపులు

SRPT: జిల్లాలో కొత్త వృద్ధాప్య పెన్షన్ల కోసం వేలాది మంది వృద్ధులు ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 35 నుంచి 40 వేల మంది వరకు అర్హులు పెన్షన్ల కోసం నిరీక్షిస్తున్నట్లు అంచనా. వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పించే పెన్షన్ ఎప్పుడు మంజూరవుతుందోనని ఎదురుచూస్తుండగా, ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.