హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యేను రామారావు పటేల్‌ను కలిసిన మున్సిపల్ కమిషనర్‌

NRML: భైంసా మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన కె.నరేష్ మంగళవారం ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆయన పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం భైంసాలో నెలకొన్న సమస్యలు, మున్సిపల్ అభివృద్ధి పనులపై ఇరువురు చర్చించారు. పట్టణ సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.