హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఖమ్మం పర్యటన రద్దు

KMM: ఈనెల 19న ఖమ్మంలో జరగాల్సిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటన రద్దయింది. ఇటీవల నిర్మాణం పూర్తిచేసుకున్న జాతీయ రహదారుల ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పాల్గొనాల్సి ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఛాపర్ ల్యాండ్ అయ్యే అవకాశాలు లేవని నివేదికలు రావడంతో మంత్రి ప్రోగ్రాం క్యాన్సిల్ అయినట్లు ఇవాళ నేషనల్ హైవే అథారిటీస్ పీడీ దివ్య తెలిపారు.