హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరు మీదుగా పుట్టపర్తికి ప్రత్యేక రైళ్లు

గుంటూరు: పుట్టపర్తి సత్యసాయి బాబా జయంతి వేడుకల నేపథ్యంలో గుంటూరు ప్రయాణికులకు రైల్వే శాఖ తీపికబురు అందించింది. విజయవాడ-యలహంక (07246/07247), శ్రీకాకుళం రోడ్-యలహంక (08555/08556) మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ నెల 20, 21, 23, 24 తేదీల్లో ఇవి రాకపోకలు సాగిస్తాయి. ఇవి గుంటూరు, నరసరావుపేట స్టేషన్లలో ఆగుతూ ప్రశాంతి నిలయం చేరుకుంటాయి.