హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్యాస్ లీక్.. ఘటనాస్థలానికి చేరుకున్న కలెక్టర్

కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరంలో ONGC గ్యాస్ లీక్ ఘటనపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఘటనాస్థలానికి కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ చేరుకుని పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఘటన జరగగానే పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. బ్లో అవుట్ టీం చేరుకుందన్నారు. రీ డ్రిల్లింగ్ పనులు చేపడుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిపారు.