హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంత్రాగచ్చి నుంచి పుట్టపర్తికి ప్రత్యేక రైళ్లు

సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించి పశ్చిమ బెంగాల్‌లోని సంత్రాగచ్చి నుంచి పుట్టపర్తికి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. రైలు నంబర్‌ 08031 సంత్రాగచ్చిలో 17, 24 తేదీల్లో బయలుదేరి పుట్టపర్తికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్‌ 08032 ఈనెల 18, 25 తేదీల్లో పుట్టపర్తి నుంచి సంత్రాగచ్చికి బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.