అన్నమయ్య: రామసముద్రం మండలం అరికెల కొత్తూరు-సానప్పల్లె రోడ్డు నిర్మాణ పనులను గత వైసీపీ ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసింది. రోడ్డంతా కంకర పరిచి వదిలేయడంతో అధ్వాన్నంగా తయారై ప్రయాణికుల పాలిట నరక ప్రాయంగా మారింది. ప్రస్తుత ప్రభుత్వం తక్షణమే స్పందించి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయండి!


