హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు

గుంటూరులోని బీఆర్ స్టేడియంలో ఈ నెల 20, 21 తేదీల్లో ప్రభుత్వ సివిల్ సర్వీస్ ఉద్యోగులకు జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు నిర్వహించనున్నారు. అథ్లెటిక్స్, క్రికెట్, కబడ్డీ, యోగా తదితర విభాగాల్లో పోటీలు ఉంటాయని డీఎస్‌డీవో అఫ్రోజ్ ఖాన్ తెలిపారు. ఉద్యోగులు ఉదయం 9 గంటలకు ఐడీ కార్డు, ఆధార్‌తో హాజరుకావాలని సూచించారు.