హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తూ. గో జిల్లాకు మరో తుఫాన్ ముప్పు!

వరుస తుఫాన్లు ఉమ్మడి తూ.గో జిల్లాను కలవరపెడుతున్నాయి. ఇప్పుడిప్పుడే గత తుఫాన్ ప్రభావం నుంచి కోలుకుంటుండగా.. తాజాగా 'అక్వాన్' తుఫాన్ ముప్పు పొంచి ఉంది. దీని ప్రభావంతో ఈ నెల 19, 20 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారుల సూచనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుందాం. ప్రాణనష్టం జరగకుండా అందరం బాధ్యతగా వ్యవహరిద్దాం.