హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉప మేయర్ పీఠంపై కూటమిలో పోటీ

అనంతపురం నగరపాలక సంస్థ ఉప మేయర్ ఎన్నిక ఈ నెల 23న జరగనుంది. 62 డివిజన్లలో కూటమికి మెజారిటీ ఉండటంతో పదవి కోసం టీడీపీ, జనసేన కార్పొరేటర్లు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నుంచి సరిపూడి రమణ, రాజారావు, బొమ్మినేని శివ, స్నేహ, శ్రీలక్ష్మి, స్వాతి, బంగి నాగేంద్ర పేర్లు వినిపిస్తున్నాయి. జనసేన నుంచి భవానీ రవికుమార్ పోటీలో ఉన్నారు.