హైదరాబాద్: 28°C
వ్యాపారం

పాజిటివ్‌గా మొదలైన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. ప్రారంభంలోనే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 244 పాయింట్ల లాభంతో పాజిటివ్‌గా మొదలై ట్రేడవుతోంది. మరోవైపు జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ సైతం లాభాల్లోనే కొనసాగుతూ 25,356 మార్కు వద్ద కదలాడుతోంది. పెట్టుబడిదారుల కొనుగోళ్ల మద్దతుతో ప్రధాన రంగాల షేర్లు రాణిస్తుండటంతో సూచీలు లాభాల బాట పట్టాయి.