హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొబ్బరికాయలో రావి మొక్క, భక్తుల రాక..!

కోనసీమ: అమలాపురం మొబర్లిపేటలోని బ్రాహ్మానందం వీధిలో నివసించే శ్రీనివాస విశ్వేశ్వరరావు ఇంట్లో కొబ్బరికాయ నుంచి రావి మొక్క మొలిచింది. కార్తీక మాసంలో ఇది దైవకృపగా భావించి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనం చూడటానికి వస్తున్నారు. సాయిబాబా ఆలయానికి తరలించి ప్రత్యేక పూజలు చేశారు. త్వరలో ఏకాదశ రుద్రాలయాల్లో ఒకటైన వ్యాఘ్రేశ్వరం శివాలయ ప్రాంగణంలో నాటాలని స్థానికులు నిర్ణయించారు.