హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అయ్యప్ప స్వామి పీఠానికి విగ్రహం వితరణ

AKP: ఎస్ రాయవరం మండలం రేవుపోలవరం అయ్యప్ప స్వామి పీఠానికి సోమలింగపాలెం గ్రామానికి చెందిన సి.ఎస్.ఈ స్పోర్ట్స్ అకాడమీ సీఈఓ పీలా సుధాకర్ అయ్యప్ప స్వామి విగ్రహాన్ని వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా పీఠంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని అభిషేకం జరిపించారు. విగ్రహాన్ని అందజేసిన సుధాకర్‌ను అయ్యప్ప భక్తులు అభినందించారు.