హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నార్పల మండలంలో వైసీపీకి షాక్

ATP: నార్పల మండలం బండ్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని 40 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వారంతా పార్టీలో చేరారని ఆమె పేర్కొన్నారు. వెంకటనారాయణరెడ్డి, దేవనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.