హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారి ఆలయంలో చోరీ

ప్రకాశం: చీమకుర్తి(M) కూనంనేనివారిపాలెంలోని పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో హుండీ చోరీ జరిగింది. సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు గేటు తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి హుండీని ధ్వంసం చేసి నగదును అపహరించారు. హుండీలో సుమారు లక్ష రూపాయలు ఉండవచ్చని ఆలయ నిర్వాహకులు తెలిపారు. సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగలను గుర్తించడం కష్టంగా మారింది. అధికారులు విచారణ చేపట్టారు.