హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొయ్యూరు మండలంలో రెండోరోజు పోటెత్తిన నామినేషన్లు

ASR: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కొయ్యూరు మండలంలో రెండోరోజు సోమవారం నామినేషన్లు పోటెత్తాయి. మొత్తం 33 పంచాయతీలకు గాను సర్పంచ్ స్థానాలకు 94 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎంపీడీవో ప్రసాదరావు తెలిపారు. అలాగే 294 వార్డు స్థానాలకు గాను మొత్తం 225 నామినేషన్లు దాఖలు అయ్యాయని చెప్పారు. మొత్తం రెండు రోజులకు గాను 100మంది సర్పంచ్ అభ్యర్థులు దాఖలు చేశారని తెలిపారు.