హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్నబ్ తుఫాన్‌తో ఛిద్రమైన రహదారులు

PPM: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో పాచి పెంట మండలంలోని మోదుగ నుంచి బోడికొండ, పొలంవలస గ్రామాలకు వెళ్లే రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రోడ్లపై రాళ్లు తేలి, పెద్దపెద్ద గోతులు ఏర్పడటంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుఫాన్ దాటి రోజులు గడుస్తున్నా అధికారులు కనీస మరమ్మతులు చేపట్టకపోవడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.