హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్తంభం తొలగించరా..?

CTR: పెనుమూరులోని జాండ్రవీధిలో విద్యుత్ స్తంభం రోడ్డు మధ్యలో ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల వీధిలో సిమెంటు రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఆ సమయంలో స్తంభం తొలగించకుండా వదిలేశారు. రాత్రి వేళల్లో ఎదురుగా వాహనాలు వస్తే స్తంభం కనిపించక ప్రమాదాల బారిన పడుతున్నారు. స్తంభాన్ని తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.