హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుఫాన్.. ఈ నంబర్లు సేవ్ చేసుకోండి

తిరుపతి: ఆక్వాన్ తుఫానుతో ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. విద్యుత్ సరఫరా అంతరాయాలను సరిచేసేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తెగిన లైన్లు, కూలిన స్తంభాల సమాచారాన్ని 1912 లేదా 1800 425 155333కు, వాట్సాప్ 9133331912కు తెలియజేయాలని కోరారు.