హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓదెల కేజీబీవీలో ట్రంక్ పెట్టెల పంపిణీ

PDPL: ఓదెల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ప్రభుత్వం సరఫరా చేసిన ట్రంక్ పెట్టెలను సోమవారం పంపిణీ చేశారు. సర్పంచ్ కనికిరెడ్డి సతీష్, ప్రత్యేక అధికారిణి జ్యోతి పాల్గొన్నారు. వసతి గృహంలో అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తోందని, విద్యార్థినులు బాగా చదివి గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు. సమస్యలుంటే తమ దృష్టికి తేవాలన్నారు.