హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజాస్వామ్య విలువలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి'

JGL: ప్రతి విద్యార్థికి ఓటు హక్కు, ఎన్నికలు, ఓటర్ల జాబితాపై అవగాహన ఉండాలని అదనపు కలెక్టర్ ఎన్.ప్రసూనాంబ అన్నారు. సోమవారం జగిత్యాల ఓల్డ్ హైస్కూల్లో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల జిల్లా స్థాయి క్విజ్, వ్యాసరచన పోటీలను ప్రారంభించారు. ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కల్పించడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో నోడల్ అధికారి రమేశ్, ఎంఈవో చంద్రకళ ఉన్నారు.