హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువులు.. జలాశయాలు.. ప్రకృతి అందాలు

SDPT: జిల్లా ప్రకృతి అందాలకు, జలవనరులకు ప్రత్యేక చిరునామాగా నిలుస్తోంది. కొమటి చెరువు మినీ ట్యాంక్‌బండ్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ వంటి జలాశయాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. సాయంత్రం వేళ చెరువుల పరిసరాల్లో ఆహ్లాదకర వాతావరణం సందర్శకులకు కనువిందు చేస్తోంది. నీటి వనరులు, పచ్చని పరిసరాలు, గ్రామీణ జీవనశైలి జిల్లాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.