VZM: కొత్తవలస మేజర్ పంచాయతీ వైసీపీ సర్పంచ్ గా కర్రి పల్లవి సోమవారం ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు సమక్షంలో నామినేషన్ వేశారు. ప్రభుత్వం ఎస్టీ రిజర్వేషన్ కల్పించడంతో ప్రజలకు సేవచేసే భాగ్యం వైసీపీ కల్పించిందని చెప్పారు. గతంలో ఉన్న పాలకులు కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవిని వ్యాపారంగా మార్చారని ఎద్దేవా చేశారు. తనను గెలిపించాలని ఆమె కోరారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపిస్తా


