NZB: భీంగల్ పట్టణ అభివృద్ధిపై మున్సిపల్ పాలకవర్గం దృష్టి సారించింది. ఆరో వార్డులో TUFIDC నిధులతో చేపట్టనున్న మురుగు కాలువల నిర్మాణానికి ఛైర్పర్సన్ నాగమణి స్వామి శ్రీకారం చుట్టారు. పనులు నాణ్యతా ప్రమాణాలతో గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో దశలవారీగా బీటీ, సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపడతామని తెలిపారు. కమిషనర్ గజానంద్ పాల్గొన్నారు.
తెలంగాణ
భీంగల్ అభివృద్ధికి మరో అడుగు


