ASR: అరకులోయ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం రాబోయే గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణపై మండలంలోని బీఎల్ఓలు, వీఆర్ఓలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఓటరు స్లిప్పుల పంపిణీ, ఓటర్లకు అందించాల్సిన సమాచారం, ఎన్నికల విధుల నిర్వహణపై సమీక్షించి సూచనలు జారీ చేశారు. తహసీల్దార్ గుంటూరు రాజా శ్రీధర్, ఎంపీడీఓ వీసం ప్రసాద్, ఆర్ఐ పట్టాసి శంకర్రావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికలపై బీఎల్ఓలు, వీఆర్ఓలతో సమావేశం


