హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందికొట్కూరులో ఎంపీ బైరెడ్డి పర్యటన

NDL: నందికొట్కూరు పట్టణంలోని కోట వీధిలో సోమవారం ఎంపీ బైరెడ్డి శబరి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు ఆమెకు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. నూతన కౌన్సిలర్లు భాస్కర్ రెడ్డి, విజయలక్ష్మి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు భానుప్రకాష్ రెడ్డితో కలిసి ప్రజలను కలిశారు. వార్డు సమస్యలు, ప్రజల అవసరాలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని ఎంపీ తెలిపారు.