హైదరాబాద్: 28°C
తెలంగాణ

బషీరాబాద్లో రేపు కొత్త పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ

VKB: బషీరాబాద్ మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన కొత్తగా ఎంపికైన చేయూత పింఛన్ లబ్ధిదారులకు మంగళవారం మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహించనున్నారు. అర్హులైన లబ్ధిదారులు సమయానికి హాజరుకావాలని సూచించారు.