హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో రేషన్ డీలర్‌కు గాయాలు

VKB: కొడంగల్ రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు కె. నరసింహులు సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మహబూబ్ నగర్లో బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా వచ్చిన బస్సును తప్పించబోయిన కారు నిలిపి ఉన్న వడ్ల ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని కోస్గిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.