హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్‌కు వెళ్తున్న అభ్యర్థిపై దాడి

అన్నమయ్య: సుండుపల్లి మండలంలో సర్పంచ్ నామినేషన్‌కు వెళ్తున్న గోళ్ల రెడ్డెప్పపై కర్రలు, రాళ్లతో దాడి చేసిన ఘటనలో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, నిందితుల నుంచి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.