హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎక్సైజ్ దాడుల్లో ఇద్దరి అరెస్ట్

SRPT: ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు. రేవూరు శివారులో 10 కిలోల బెల్లం, 40 కిలోల పటిక స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేశారు. పాలకీడు మండలం బేతె తండాలో 4 లీటర్ల నాటుసారా పట్టుకుని మరొకరిని అరెస్ట్ చేశారు. రెండు కేసుల్లో ఇద్దరిని అరెస్ట్ చేయగా, ఐదుగురిపై బైండోవర్ చర్యలు చేపట్టారు.