SRCL: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం రాత్రి మహాలింగార్చన కార్యక్రమం ఘనంగా జరిగింది. వేద పండితులు వేదమంత్రోచ్చారణలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, బిల్వార్చన నిర్వహించారు. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా ఆలయ అర్చకులు నిర్వహించారు.
తెలంగాణ
రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహా లింగార్చన


