హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేషనల్ కబడ్డీ క్యాంపుకు ఉష ఎంపిక

KMR: కబడ్డీ జూనియర్ గర్ల్స్ విభాగంలో గాంధారి మండలానికి చెందిన ఉష నేషనల్ క్యాంపుకు ఎంపికైనట్లు కామారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ రాజన్న తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించే శిక్షణ శిబిరంలో ఆమె పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, కమిటీ సభ్యులు ఉషను అభినందించారు.