హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చింతలపూడి ఎత్తిపోతల పథకం భూసేకరణ

ELR: చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువకు అవసరమైన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. సోమవారం జేసీ కార్యాలయంలో ప్రాజెక్టు భూసేకరణ, పరిహారం చెల్లింపులు, భూముల అప్పగింతపై సమీక్షించారు. పెండింగ్ పరిహార చెల్లింపులకు అవసరమైన పత్రాలను రైతుల నుంచి సేకరించి త్వరితగతిన అందజేయాలని సూచించారు