హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆశా వర్కర్లకు రూ. 18వేల వేతనం ఇవ్వాలి: CITU

NGKL: కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ ఎదుట సోమవారం ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి. ఆంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో డిసెంబర్ 15 నుంచి చేపట్టనున్న సమ్మె నోటీసును డీఎంహెచ్‌ఓ డాక్టర్ కృష్ణకు అందజేశారు.