హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎమ్మెల్యేను అభినందించిన కాంగ్రెస్ ఇంఛార్జ్

BPT: ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ పీవీ మోహన్ సోమవారం చీరాలలో పర్యటించారు. పందిళ్లపల్లిలోని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. పార్టీ బలోపేతానికి ఆమంచి చేస్తున్న కృషిని ప్రశంసించి, ఇటీవల ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.