హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తర్లుపాడు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ

ప్రకాశం: తర్లుపాడు పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ లోని పలు రికార్డులు, కేసుల నిర్వహణ రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి, కేసుల పురోగతి, సిబ్బంది విధులు, సమస్యలపై ఆరా తీశారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని, విధుల పట్ల పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు.