హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థుల పోరాటంతోనే జీవో 97 రద్దు: మాజీ MLA

WGL: పాలిటెక్నిక్ విద్యార్థుల ఐక్య పోరాట ఫలితంగానే కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 97ను వెనక్కి తీసుకుందని మాజీ MLA దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సోమవారం వరంగల్‌లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంబరాల్లో పాల్గొని విద్యార్థులతో కలిసి టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఐటీఐ, ఏటీసీ విద్యార్థుల సమస్యలను కూడా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.